సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వలేం: మంత్రి డోలా

12555చూసినవారు
సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వలేం: మంత్రి డోలా
AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించినా ఎందుకు ఆందోళన చేస్తున్నారో అర్థం కావడం లేదని మంత్రి డీబీవీ స్వామి అన్నారు. సచివాలయ ఉద్యోగులకు నోషనల్‌ ఇంక్రిమెంట్లు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఆ ఇంక్రిమెంట్లు ఎవరికీ లేవని, ఉద్యోగులకు ఎలా ఇస్తామని ప్రశ్నించారు. గతంలో రూ.15 వేల జీతంతో రెండేళ్లు పనిచేసినప్పుడు ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం సరికాదన్నారు. ఇప్పటికే 15 వేల మందికిపైగా పదోన్నతులు కల్పించామని తెలిపారు.

సంబంధిత పోస్ట్