AP: డ్వాక్రా మహిళల కుమార్తెల వివాహానికి కూటమి ప్రభుత్వం ‘ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి’ పథకం అమలు చేయనుంది. 4 శాతం వడ్డీతో రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు రుణం ఇవ్వనుంది. గరిష్టంగా 48 వాయిదాల్లో డబ్బు చెల్లించవచ్చు. లగ్న పత్రిక, పెళ్లి ఖర్చు అంచనా వ్యయం పత్రాలను సమర్పించాలి. వివాహానికి సంబంధించిన వివరాలు పరిశీలించిన తర్వాత సభ్యురాలి బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేస్తారు.