ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలు బంద్.. స్పందించిన వైఎస్ షర్మిల

0చూసినవారు
ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలు బంద్.. స్పందించిన వైఎస్ షర్మిల
NTR ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంపై వైఎస్‌ షర్మిల తీవ్రంగా స్పందించారు. ‘‘ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి పేదలకు వైఎస్ఆర్‌ దేవుడయ్యారు, కానీ దాన్ని నిర్వీర్యం చేసిన చంద్రబాబు రాక్షసుడయ్యాడు’’ అని అన్నారు. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీపై కుట్రలు చేస్తోందని, ప్రైవేట్‌ ఆరోగ్య బీమా ముసుగులో సంజీవని లాంటి పథకాన్ని చంపేస్తోందని ఆరోపించారు. రూ.2,700 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉంచడం కుట్రలో భాగమని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీని ‘అనారోగ్యశ్రీ’గా మార్చడం సహించరాని చర్య అని అన్నారు.

సంబంధిత పోస్ట్