AP: రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణకు అంగీకారం లభించింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆధ్వర్యంలో సచివాలయంలో అధికారులు, ఏపీ స్పెషాలిటీ హాస్పటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిగాయి. సీఎఫ్‌ఎంఎస్‌లో ఉన్న రూ.670 కోట్లు పది రోజుల్లో విడుదల చేస్తామని అధికారుల హామీ ఇచ్చారు. ఇవాళ్టి నుంచే ఎన్టీఆర్ వైద్య సేవలు పూర్తి స్థాయిలో పునరుద్ధరించనున్నట్లు ఆశా ప్రెసిడెంట్ విజయకుమార్ రెడ్డి తెలిపారు.