రూ.1750 కోట్లతో NTR విగ్రహం: మంత్రి నారాయణ

17చూసినవారు
AP: అమరావతిలో ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ విగ్రహ నిర్మాణానికి సుమారు 1750 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, దీని బరువు 65 వేల టన్నులు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 182 మీటర్ల ఎత్తు ఉండే ఈ విగ్రహంలోకి పర్యాటకులు లిఫ్ట్ ద్వారా వెళ్లి, 160 మీటర్ల ఎత్తు నుంచి నగరాన్ని వీక్షించవచ్చని వివరించారు. విగ్రహం ఏర్పాటుకు 3,500 టన్నుల కాంస్యం వినియోగించనున్నట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్