కొత్త సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వెలువడింది. పురాణ నేపథ్యంతో రూపొందనున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కార్తికేయుడి పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా ప్రకటిస్తూ, "శివుడి కుమారుడు.. పార్వతీదేవికి గర్వకారణం.. దేవసేనాని.. మరోసారి త్రివిక్రమ్‌తో" అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గతంలో ప్రకటించి ఆగిపోయిన ప్రాజెక్టు స్థానంలో ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం తెరకెక్కనుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే నటీనటులు, సాంకేతిక బృందం, చిత్రీకరణ వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.