బాపులపాడు మండలం వేలేరు సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జవహర్ నవోదయ ప్రిన్సిపల్ యాదూనందన్ రావు మృతి చెందారు. టిప్పర్ లారీని కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.