
NTR: వామ్మో.. బుసలు కొట్టదు, నేరుగా కాటేస్తుంది (VIDEO)
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని కోదాడ రోడ్డు పుట్ట బజార్లో రెండు రోజులుగా ప్రజలను భయపెడుతున్న అత్యంత ప్రమాదకరమైన 'చంద్రనాగు' అనే విష సర్పం స్నేక్ మిత్ర సుధాకర్ చాకచక్యంగా పట్టుకున్నారు. శబ్దం చేయకుండా కాటు వేయడం ఈ పాము ప్రత్యేకత అని ఆయన తెలిపారు. అనంతరం ఆ పామును సురక్షితంగా బూదవాడ ఫారెస్ట్‌లో విడిచిపెట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.






































