రక్తసిక్తమైన న్యూఇయర్ వేడుకలు.. యువకుల మధ్య భీకర దాడి

1057చూసినవారు
జగ్గయ్యపేట మండలం తొరగంటపాలెంలో న్యూ ఇయర్ వేడుకలు రక్తసిక్తమయ్యాయి. అర్ధరాత్రి రోడ్డుపై కేక్ కట్ చేస్తున్న యువకుల బృందానికి, కారులో వచ్చిన మరో వర్గానికి మధ్య ఘర్షణ తలెత్తింది. కేక్ కట్ చేసిన తర్వాతే రోడ్డు ఖాళీ చేస్తామని చెప్పడంతో ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి దాడులకు దారితీసింది. ఈ దాడిలో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్