మొంథా తుఫాన్: ఎన్టీఆర్ జిల్లాలో జనజీవనం స్తంభించింది

2781చూసినవారు
ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లో మొంథా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జగ్గయ్యపేట పట్టణంలో వేపలవాగు ఉప్పొంగి వీధుల్లోకి వరదనీరు చేరగా, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పెనుగంచిప్రోలు మండలంలోని ముండ్లపాడు వద్ద వాగుకు గండి పడటంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జగ్గయ్యపేట మండలంలోనూ చెరువు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు పరిస్థితిని సమీక్షించి, అవసరమైన చర్యలు చేపడుతున్నారు.

సంబంధిత పోస్ట్