డాంగే నగర్ సమీపంలో అగ్నిప్రమాదం

347చూసినవారు
డాంగే నగర్ సమీపంలో  అగ్నిప్రమాదం
జగ్గయ్యపేటలోని డాంగే నగర్ సమీపంలో శనివారం మధ్యాహ్నం మొక్కజొన్న కోత అనంతరం మిగిలిన వ్యర్థాలను తగులబెట్టగా అగ్నిప్రమాదం సంభవించింది. గాలుల తీవ్రతకు మంటలు వేగంగా విస్తరించడంతో పక్కనే ఉన్న టేకు చెట్లకు అంటుకునే ప్రమాదం ఏర్పడింది. రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై తమకు ఇంకా ఎటువంటి ఫిర్యాదు అందలేదని అగ్నిమాపక శాఖాధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్