హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు జగ్గయ్యపేట మండలం గౌరవరం గ్రామం వద్ద NH 65 జాతీయ రహదారి సమీపంలోని కాలువలోకి శనివారం రాత్రి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న చిల్లకల్లు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక యువకులు ఐదుగురు ప్రయాణికులను కాపాడి మానవత్వం చాటుకున్నారు. చిల్లకల్లు ఎస్సైలు సూర్య శ్రీనివాస్, సాయి మణికంఠ బాధితులకు సీపీఆర్ చేసి, జగ్గయ్యపేట ఆసుపత్రికి తరలించారు. బాధితులు హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు.