జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో లోన్ తీసుకున్న మహేశ్ అనే యువకుడిపై ఫైనాన్సర్ ముసుగులో విచక్షణారహితంగా దాడి జరిగింది. బుధవారం తెల్లవారుజామున ఫైనాన్స్ డబ్బులు కట్టాలని అడిగేందుకు వెళ్ళిన ఫైనాన్స్ ప్రతినిధులు, మాట మాట పెరిగి మహేశ్‌పై దాడికి పాల్పడ్డారని స్థానికులు తెలిపారు. బాధితుడు ఎంత చెప్పినా ఫైనాన్స్ వారు వినకుండా దాడి చేశారని పేర్కొన్నారు.