జగ్గయ్యపేట మండలం ముత్యాల గ్రామ శివారులోని ఓ కెమికల్ కంపెనీలో శుక్రవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో కంపెనీలోని కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కంపెనీలోని ఆయిల్ డ్రమ్ములు అధిక వేడికి గురికావడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.