జగ్గయ్యపేట: మెషనరీ బెల్టు తగిలి కూలీ మృతి

501చూసినవారు
జగ్గయ్యపేట మండలం ధర్మవరపాడు తండా వద్ద ఓ సిమెంట్ కర్మాగారంలో లోడింగ్ వద్ద పనిచేస్తున్న మహారాష్ట్రకు చెందిన దాసరి శ్యామ్ (40) అనే కార్మికుడు, మిషనరీకి చెందిన బెల్టు తెగి తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు, కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ దుర్ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.