పెనుగంచిప్రోలుకు చెందిన 25 ఏళ్ల రాజేశ్వరికి పురిటినొప్పులు రావడంతో మొదట స్థానిక ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం జగ్గయ్యపేటకు తరలించారు. మార్గమధ్యంలోనే నొప్పులు తీవ్రమవ్వడంతో 108 సిబ్బంది వాహనంలోనే సుఖప్రసవం చేయించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.