సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణ ప్రజలు సొంత ఊళ్లకు వెళ్తుండటంతో కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ గణనీయంగా పెరిగింది. విద్యా సంస్థలు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించడంతో జాతీయ రహదారిపై రాకపోకలు భారీగా పెరిగాయి. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని టోల్ అధికారులు ఏడు వరుసల ద్వారా వాహనాలను అనుమతిస్తున్నారు. నిత్యం 50 వేల నుంచి 70 వేల వరకు వాహనాలు టోల్ ప్లాజాను దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.