మందుబాబులకు నిలయంగా మారిన కొత్త రైతు బజార్ ప్రాంతం

386చూసినవారు
మందుబాబులకు నిలయంగా మారిన కొత్త రైతు బజార్ ప్రాంతం
జగ్గయ్యపేటలోని కొత్త రైతు బజార్ ప్రాంతం ప్రస్తుతం మందుబాబులకు అడ్డాగా మారింది. మార్కెట్ ప్రహరీ గోడ పక్కన అనధికారికంగా ఏర్పాటు చేసిన పాకల్లో కొందరు వ్యక్తులు బహిరంగంగా మద్యం సేవిస్తున్నారు. వారి అసభ్య ప్రవర్తన వల్ల అటుగా వెళ్లే మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆక్రమణలను తొలగించి, పోలీసు గస్తీని పెంచాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్