పెనుగంచిప్రోలులోని సాయిబాబా గుడి సమీపంలో గల చెరువు కట్ట కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. శనివారం తెల్లవారుజామున స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చి గుర్తించే ప్రయత్నం చేశారు. అనంతరం మృతదేహాన్ని జగ్గయ్యపేట మార్చురీకి తరలించినట్లు ఎస్ఐ అర్జున్ తెలిపారు.