జగ్గయ్యపేట మండలం షేర్‌మహమ్మద్‌పేట ఆలయ ఈవో వైష్ణవి గ్రూప్-1 పరీక్షలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. బీటెక్‌లో గోల్డ్ మెడలిస్ట్ అయిన వైష్ణవి, ఇప్పటికే గ్రూప్-2 సాధించి దేవాదాయ శాఖలో పనిచేస్తున్నారు. ఉద్యోగం చేస్తూనే గ్రూప్-1 సాధించిన ఆమె, తన తదుపరి లక్ష్యం సివిల్స్ అని ధీమా వ్యక్తం చేశారు. కుమార్తె విజయంతో ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.