జగ్గయ్యపేట నియోజకవర్గం, వత్సవాయిలోని గాంధీపార్క్ సెంటర్లో ఉన్న పురాతన బస్టాండ్ ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. స్థానిక పత్తి వ్యాపారులు దీనిని గోడౌన్ గా వాడుకుంటున్నారు. దీంతో ప్రయాణికులు వర్షం నుండి తలదాచుకోవడానికి కూడా చోటు లేకుండా పోయింది. రాత్రిపూట నిరాశ్రయులు, యాచకులు నిద్రించడానికి స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వ్యాపారులను అక్కడి నుంచి తొలగించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.