
ఎన్టీఆర్: దుకాణాలు మూయలేదని నిర్వాహకులపై దాడి చేసిన ఎస్సై |
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో శుక్రవారం నిర్వాహకులపై ఎస్సై పురుషోత్తమ్ లాఠీతో దాడి చేశారు. నిర్ణీత సమయంలోపే దుకాణాలు మూస్తున్నామని నిర్వాహకులు చెప్పినా వినకుండా ఎస్సై దాడి చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.




































