ఎన్టీఆర్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ మెరుపు దాడులు

241చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ మెరుపు దాడులు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఈ కార్యాలయంలోకి బయటి వ్యక్తులను అనుమతించకుండా గేట్లు మూసివేసి సోదాలు చేపట్టారు. తమ పరిధిలోని కార్యాలయాలను సాధారణ తనిఖీల్లో భాగంగానే పరిశీలిస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.