ఇబ్రహీంపట్నంలో ప్రమాదం.. హెడ్ కానిస్టేబుల్కు మృతి

1207చూసినవారు
ఇబ్రహీంపట్నంలో ప్రమాదం.. హెడ్ కానిస్టేబుల్కు మృతి
ఇబ్రహీంపట్నంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభు కుమార్ అనే హెడ్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. వీరులపాడులో విధి నిర్వహణ ముగించుకొని ఇంటికి వస్తుండగా, బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. 108 ద్వారా విజయవాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.

సంబంధిత పోస్ట్