
పీఎం ముద్ర యోజన.. వ్యాపార రుణ పరిమితి రూ.20 లక్షలకు పెంపు
నిరుద్యోగులు, కొత్త వ్యాపారవేత్తలకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ పథకం కింద వ్యాపారం ప్రారంభించడానికి లేదా అభివృద్ధి చేయడానికి రుణాలు మంజూరు చేస్తారు. గతంలో రూ.10 లక్షల వరకు ఉన్న రుణ పరిమితిని ఇప్పుడు రూ.20 లక్షలకు పెంచారు. శిశు, కిషోర్, తరుణ్ అనే మూడు కేటగిరీల కింద రుణాలు అందిస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్, బిజినెస్ ప్రాజెక్ట్ రిపోర్ట్, బ్యాంక్ స్టేట్ మెంట్స్ వంటివి అవసరం. www.udyamimitra.in వెబ్సైట్ ద్వారా లేదా ఏదైనా బ్యాంకును సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు.




