ఇబ్రహీంపట్నంలో నలుగురు వ్యక్తులకు పాజిటివ్

1619చూసినవారు
ఇబ్రహీంపట్నంలో నలుగురు వ్యక్తులకు పాజిటివ్
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండపల్లిలో గత రాత్రి గంజాయి తాగుతూ పట్టుబడిన యువకులకు పోలీసులు టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టుల్లో వారికి గంజాయి వాడకం పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం, వారిని కౌన్సిలింగ్ కోసం విజయవాడ తరలించారు. సీఐ సుబ్రహ్మణ్యం యువకులకు గంజాయికి దూరంగా ఉండాలని, దాని వాడకంతో కుటుంబాలను ఇబ్బందుల్లోకి నెట్టవద్దని సూచిస్తూ కౌన్సిలింగ్ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్