
రూ.10కే దోశ.. పేదల ఆకలి తీరుస్తున్న సన్నో కౌర్
గువాహటిలో 47 ఏళ్ల సన్నో కౌర్ అనే మహిళ రూ.10కే దోశ, ఇడ్లీ వంటి దక్షిణాది అల్పాహారాన్ని అందిస్తూ విద్యార్థులు, పేదల ఆకలి తీరుస్తున్నారు. యూట్యూబ్‌లో చూసి వంటలు నేర్చుకుని కుటుంబ సభ్యుల సహకారంతో ఈ హోటల్‌ను ప్రారంభించారు. లాభార్జన కంటే సేవకే ప్రాధాన్యతనిస్తూ రోజుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు గిట్టుబాటు అవుతోందని తెలిపారు. వంటగ్యాస్, ముడి పదార్థాల ధరలు పెరుగుతున్నా, భవిష్యత్తులోనూ ధరలు అందుబాటులోనే ఉండేలా చూసుకుంటానని ఆమె పేర్కొన్నారు.




