గొల్లపూడి: అయ్యప్ప దీక్షా వస్త్రాలతో పాఠశాలకు హాజరు

1310చూసినవారు
గొల్లపూడి: అయ్యప్ప దీక్షా వస్త్రాలతో పాఠశాలకు హాజరు
ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని జీఐజీ ఇంటర్నేషనల్ పాఠశాలలో అయ్యప్ప మాల ధరించిన 5వ తరగతి విద్యార్థిని యాజమాన్యం అనుమతించకపోవడంతో వివాదం చెలరేగింది. సమాచారం అందుకున్న అయ్యప్ప భక్తులు, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాఠశాల వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. విషయం డీఈవో యు. వి. సుబ్బారావు దృష్టికి వెళ్లడంతో ఆయన పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. యాజమాన్యం క్షమాపణ చెప్పి విద్యార్థిని అనుమతిస్తామని తెలిపింది. ఇటీవల విద్యాధరపురంలోనూ ఇలాంటి సంఘటన జరగడంతో, డీఈవో శుక్రవారం పాఠశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.