పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్ల సందర్భంగా పోలీస్ శాఖ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. విజయవాడ సీపీ రాజ్‌శేఖర్ బాబు ఆదేశాల మేరకు 400 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ బందోబస్తులో ఇద్దరు డీసీపీలు, 8 మంది డీఎస్పీలు, 17 మంది సీఐలు, 32 మంది ఎస్ఐలు విధులు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, తోపులాటలు జరగకుండా నిరంతరం నిఘా ఉంచారు.