చంద్రబాబు లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు.. వెంకటరెడ్డి

787చూసినవారు
రెడ్డిగూడెం మండల వైసీపీ అధ్యక్షులు కుప్పిరెడ్డి వెంకటరెడ్డి, మైలవరంలో నిర్వహించిన 'వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమంలో చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు వంటి వ్యక్తిని దేశంలో ఎక్కడా చూడలేదని, అబద్ధపు హామీలతో ప్రజలను వెన్నుపోటు పొడిచారని ఆయన ఆరోపించారు. లోకేష్ కూడా ప్రజలను మోసం చేయడంలో గారడి విద్యలు నేర్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్