ఇబ్రహీంపట్నం: నారా లోకేశ్పై జోగి రమేశ్ ఘాటు వ్యాఖ్యలు

661చూసినవారు
మాజీ మంత్రి జోగి రమేశ్ శనివారం ఇబ్రహీంపట్నంలో మీడియాతో మాట్లాడుతూ, లోకేష్ ఒళ్లు తగ్గితే కొవ్వు తగ్గిందనుకున్నామని, కానీ ఆయన మెదడులో చిప్ పోయిందని విమర్శించారు. టీడీపీని ఒక కల్తీ పార్టీగా, చంద్రబాబును కల్తీ అధ్యక్షుడిగా అభివర్ణించారు. దేవుడి పేరుతో రాజకీయం చేస్తున్న కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరలోనే భ్రష్టు పట్టిందని, ప్రజలకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్