ఇబ్రహీంపట్నం: పెట్రోల్ కోసం వెళ్లాడు.. బైక్ దోచేశారు!

కొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో పార్క్ చేసిన ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. ఇబ్రహీంపట్నానికి చెందిన బస్సు డ్రైవర్ మణికంఠ రాజు తన హోండా యాక్టివా (ఏపీ 39 జేఎల్ 1801) వాహనంలో ఇంధనం అయిపోవడంతో ఆసుపత్రి వద్ద పార్క్ చేసి ఇంధనం తీసుకురావడానికి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి వాహనం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసుకున్నారు.
