కోటమీ ప్రభుత్వానికి లారీ ఓనర్ల విజ్ఞప్తి.. దయ చూపించండి సారు

746చూసినవారు
కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నంలోని బూడి చెరువు నుండి గత 40 ఏళ్లుగా ఉచితంగా బూడిదను తరలిస్తూ జీవనం సాగిస్తున్న లారీ యజమానులు, డ్రైవర్లు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. గతంలో ఉచితంగా లోడ్ చేసే ఎన్.టి.టి.పి.ఎస్. అధికారులు, ఇప్పుడు బూడిదను ఒక కార్పొరేట్ సంస్థకు అప్పగించి, రూ. 3000 వెలకు కొనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తున్నారని వారు ఆరోపించారు. దీనికి అంగీకరించని కారణంగా, గత 41 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామని, ఈ క్రమంలో ముగ్గురు డ్రైవర్లు మరణించారని తెలిపారు. ఈ టెండర్ వల్ల వెయ్యి కుటుంబాలు రోడ్డున పడతాయని, కూటమి ప్రభుత్వాన్ని టెండర్ రద్దు చేయాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్