రాత్రి 10 గంటల తర్వాత మద్యం సేవించి రోడ్లపై హల్చల్ చేసేవారు, దొంగతనాలు చేసేవారు, అతివేగంగా వాహనాలు నడిపేవారిపై మైలవరం సీఐ డి. చంద్రశేఖర్ ఉక్కుపాదం మోపనున్నారు. అర్థరాత్రి కూడా సైకిల్‌పై మఫ్టీలో తిరుగుతూ, అనుమానం వచ్చిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. సందుగొందుల్లో, జాతీయ రహదారులపై కూడా ఆయన పహారా కాస్తారు. సామాన్యుడిలా తిరుగుతూ ఆకతాయిల అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు.