మైలవరం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య వ్యర్థాల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం నెలకొంది. రోగులు వాడిన సిరంజులు, బయో-మెడికల్ వ్యర్థాలను నిర్వీర్యం చేయకుండా అక్కడే వేయడంతో, రోగులు చికిత్స కోసం వచ్చి మరో రోగాన్ని కొనితెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి, ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించాలని కోరుతున్నారు.