మైలవరం: ధాన్యం అమ్మడానికి ఎన్ని తిప్పలో!

723చూసినవారు
మైలవరంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం ప్రకటనలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. పౌరసరఫరాల సంస్థ అధికారులు తేమశాతం సాకుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారు. గోనె సంచులు, రవాణా వాహనాలు సకాలంలో అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. గత వారం రోజులుగా రైతులు సొంతంగా బండ్లు తెచ్చుకోవాలని, కిరాయి కూడా వారే భరించాలని అధికారులు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. ఈ-క్రాప్, తేమశాతం నిబంధనలతో ఇబ్బంది పడేకంటే నేరుగా మిల్లర్లకు అమ్మితే పని త్వరగా పూర్తవుతుందని రైతులు భావిస్తున్నారు.