మైలవరం: పెంచిన చేతులే.. నరికేస్తున్నాయ్

1204చూసినవారు
మైలవరం ప్రాంతంలో తగ్గిన దిగుబడులు, పెరిగిన చీడపీడలు, పడిపోయిన ధరల కారణంగా మామిడి తోటల విస్తీర్ణం తగ్గుతోంది. గత ఏడేళ్లుగా వేసవిలోనూ గాలిలో తేమ శాతం అధికమవడం, తామర పురుగులు, బూడిద తెగులు వంటి చీడపీడలు తీవ్రంగా ఆశించడం వల్ల నాణ్యత, దిగుబడి తగ్గి రైతులు నష్టపోతున్నారు. దీంతో చాలామంది రైతులు మామిడి పంటను నరికివేస్తున్నారు. గతంలో పొడి వాతావరణం మామిడికి అనుకూలంగా ఉండేదని రైతులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్