మైలవరం: వారికి షాక్ ఇచ్చిన పోలీసులు

634చూసినవారు
మైలవరం: వారికి షాక్ ఇచ్చిన పోలీసులు
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మైలవరం పరిధిలో పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు పెరిగే ప్రమాదం ఉందని భావించిన అధికారులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను మరికొన్ని రోజులు పొడిగించారు. ఏసీపీ, సీఐ చంద్రశేఖర్‌తో పాటు ఎస్ఐలు సుధాకర్, గిరిసాయి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 3వ తేదీ వరకు ప్రత్యేకంగా డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు, వాహనాల తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు బాధ్యతతో వ్యవహరించి సహకరించాలని పోలీసులు కోరారు.

సంబంధిత పోస్ట్