
పరకామణి కేేసు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
AP: పరకామణి నేరం దొంగతనం కన్నా మించినదని, కానుకల లెక్కింపులో టెక్నాలజీ వినియోగించాలని, తప్పిదం జరిగితే తక్షణం అప్రమత్తం చేసేలా ఉండాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. లెక్కింపును మానవరహితంగా చేపట్టాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి బాధ్యత ఉండదని, అందుకే పరకామణి ఘటన జరిగిందని పేర్కొంది. కానుకల లెక్కింపునకు భక్తులను ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. పరకామణిలో టేబుళ్లు ఏర్పాటు చేయాలని సూచించింది.




