ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఎస్సై పురుషోత్తం దుకాణదారులపై లాఠీలతో దాడి చేశారు. నిర్ణీత సమయంలోపే దుకాణాలు మూసివేస్తున్నామని చెప్పినా వినకుండా, ప్రాధేయపడినా కనికరించకుండా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేశారు. దుకాణదారుల తీరును ప్రశ్నించిన 12వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అనిల్‌పై ఎస్సై దుర్భాషలాడారు.