తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మున్నేరు నదికి వరద పోటెత్తింది. దీనితో నది సమీపంలోని శ్రీ సాయిబాబా మందిరం, శివాలయం వరద నీటిలో మునిగిపోయాయి. సాయిబాబా ఆలయంలో నివాసం ఉంటున్న కుటుంబాన్ని పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. మున్నేరు బ్రిడ్జిపై నుంచి రాకపోకలను నిలిపివేశారు.