రెడ్డిగూడెం ఎస్ఐ సస్పెండ్ చేయాలని డీసీపీ సరిత కు వినతి పత్రం

934చూసినవారు
రెడ్డిగూడెం ఎస్ఐ సస్పెండ్ చేయాలని డీసీపీ సరిత కు వినతి పత్రం
విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం డీసీపీ సరితను కలిసి, మైలవరం సబ్ డివిజన్ లో ఎస్సీలపై పోలీసులు చేస్తున్న దాడులు, ముఖ్యంగా రెడ్డిగూడెం ఎస్ఐ మోహన్ రావు మాదిగలపై ఉద్దేశపూర్వకంగా దాడి చేసి, అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఎమ్మార్పీఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఎస్సీ వర్గీకరణ ఫలాలు మాదిగ సామాజిక వర్గానికి అందకుండా చేయడమే లక్ష్యంగా చదువుకున్న మాదిగ యువకులను టార్గెట్ చేస్తున్నారని వారు ఆరోపించారు. గతంలో పోలీస్ స్టేషన్ ముట్టడికి హామీ లభించినా, మైలవరం ఏసీపీ ప్రసాదరావు చర్యలు తీసుకోలేదని నాయకులు దుయ్యబట్టారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ ను కలిసి ఫిర్యాదు చేసినట్లు, నేడు డీసీపీని, ఎమ్మెల్యేను కలిసినట్లు తెలిపారు. చర్యలు తీసుకోకపోతే మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :