బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు.

982చూసినవారు
బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు.
కొండపల్లిలో ఓ బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 9న ఓ బాలిక (12) నడుచుకుంటూ రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కరెంట్ పోవడంతో అదే ప్రాంతానికి చెందిన ఓ బాలుడు (16) అసభ్యకరంగా ప్రవర్తించినట్లు పోలీసులు తెలిపారు. చీకట్లో బాలిక కేకలు వేయడంతో స్థానికులు స్పందించి బాలికను కాపాడినట్లు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో బాలుడు పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్