పుల్లూరు: ఒకేరోజు రెండు అగ్ని ప్రమాదాలు..

321చూసినవారు
పుల్లూరు: ఒకేరోజు రెండు అగ్ని ప్రమాదాలు..
మైలవరం మండలం పుల్లూరు గ్రామ శివారులోని వ్యవసాయ భూమిలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కంచెతో పాటు భారీ వృక్షాలు అగ్నికి ఆహుతయ్యాయని అగ్నిమాపక అధికారులు తెలిపారు. పొలంలో రొట్టను తగలబెట్టడమే ఈ ప్రమాదానికి కారణమని వారు పేర్కొన్నారు. సీతారాంపురం తండాలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొన్నట్లు అధికారులు వెల్లడించారు. అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, రొట్టను తగలబెట్టే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్