రెడ్డిగూడెం: పూర్తయిన సేవలకు నోచుకోని వెల్నెస్ సెంటర్లు

821చూసినవారు
రెడ్డిగూడెం(M)లోని రంగాపురం, రుద్రవరం, కొనపరాజుపర్వ 2 గ్రామాల్లో వెల్నెస్ సెంటర్లు (విలేజ్ క్లినిక్లు) పూర్తయి ఏడాది దాటినా ప్రజలకు సేవలు అందడం లేదు. గత వైసిపి ప్రభుత్వం ఒక్కో క్లినిక్ కు రూ. 22.80 లక్షలు వెచ్చించి పూర్తి చేసింది. ప్రభుత్వం మారడంతో అధికారులు ఈ క్లినిక్లను నిరుపయోగంగా వదిలేశారు. స్థానిక ప్రజలు మెరుగైన వైద్యం కోసం ఈ విలేజ్ క్లినిక్లను వెంటనే ప్రారంభించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్