'ఏ' కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం!

2114చూసినవారు
ఇబ్రహీంపట్నం మండలం 'ఏ' కాలనీ సమీపంలో రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొని ప్రమాదానికి గురయ్యాయి. తిరువూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న క్రమంలో ముందు వెళ్తున్న కారు అకస్మాత్తుగా ఎడమ వైపునకు తిరగడంతో, వెనుక వస్తున్న మరో కారు దానిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ఎయిర్ బ్యాగులు సకాలంలో తెరుచుకోవడంతో ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. అయితే రెండు కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

సంబంధిత పోస్ట్