జూపూడి వద్ద రోడ్డు ప్రమాదం.. వృద్ధురాలు దుర్మరణం..

707చూసినవారు
జూపూడి వద్ద రోడ్డు ప్రమాదం.. వృద్ధురాలు దుర్మరణం..
బుధవారం ఇబ్రహీంపట్నం మండలం జూపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధురాలు మృతి చెందింది. అతివేగంగా దూసుకువచ్చిన కారు రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించినట్లు స్థానికులు తెలిపారు. మృతురాలు కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామానికి చెందిన వృద్ధురాలని గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్