గంజాయి కేసులో ఆరుగురు అరెస్ట్.. 3కేజీల గంజాయి స్వాధీనం

2171చూసినవారు
మైలవరంలో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు ACP ప్రసాదరావు, CI కిషోర్ బాబు తెలిపారు. నిందితుల నుండి మూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వారిలో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఇద్దరు, నూజివీడుకు చెందిన ఇద్దరు, మైలవరం ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వీరిపై గతంలో పదుల సంఖ్యలో కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించనున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్