మైలవరం మండలం పుల్లూరు హెల్త్ సెంటర్ లో 'స్వస్థ నారి సశక్తి పరిహార్ అభియాన్' కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బంది గర్భిణీలు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పుల్లూరు సర్పంచి, డాక్టర్ శరత్ బాబు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.