మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన పత్తిపాటి నాగార్జున (62) తాను కట్టుకున్న ఇంటికి ఇంటి పన్ను రసీదు ఇవ్వడానికి పంచాయతీ సెక్రటరీ సురేష్ రెండేళ్లుగా తిప్పించుకుంటున్నారని ఆరోపించారు. ఇంటి పన్ను కోసం వెళ్ళినప్పుడల్లా 'ఇదిగో రేపు ఇస్తా, ఇదిగో రేపు ఇస్తా' అంటూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన తెలిపారు. జిల్లా అధికారులు స్పందించి తమ ఇంటికి ఇంటి పన్ను రసీదు ఇప్పించవలసిందిగా ఆయన కోరారు.